తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేదాక విశ్రమించబోమని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే మా లక్ష్యమని రాజ్‌నాథ్ ఉధ్ఘాటించారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ ప్రసంగించారు.
ఇందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ కోసం సంయుక్తంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయలకభ్దికోసం తెలంగాణ అంశాన్ని వినియోగించే రాజకీయ పార్టీ తమది కాదని అన్నారు. "విద్రోహంపై విజయం" పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నృత్యాలు, బతుకమ్మ ఆటలు చోటుచేసుకున్నాయి.
ఇందులో పార్టీ భాజపా అగ్రనేతలు వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జగదేవర్, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వెంకయ్య చేసిన ప్రసంగంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తూ, ప్రజలను మోసం చేస్తుందన్నారు.
|