వరికి వెయ్యిరూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. విచారణ కమీషన్‌కు సిద్ధమేనానని వైఎస్సార్ చేసిన సవాలుకు బాబు స్పందిస్తూ ఇప్పటికే ఇటువంటి విచారణ కమీషన్లను రాష్ట్ర ప్రభుత్వం చేత ఎదుర్కొన్నామని చెప్పారు.
ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని.. తమపై ఇన్‌కమ్ టాక్స్ దాడులు వంటి కార్యకలాపాలను జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడిగా తమ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోందని బాబు ఆరోపించారు. ప్రాజెక్టుల నాణ్యత లోపించకుండా వాటిని త్వరితంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
|