ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
16న వామపక్షాలతో భేటీ కానున్న తెదేపా
ఈ నెల 16వ తేదీన తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీలో వామపక్షాలతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ విలేకరులతో వెల్లడించారు. రైతుల అభ్యున్నతికి తెదేపా అమలు చేయనున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలను వామపక్షాలకు తెలియజేస్తామని ఆయన అన్నారు.

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఆర్థిక విధానాలను వామపక్షాల ముందుంచుతామని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల్లో వెనుకబడిన వర్గాలు పేదల తెదేపా రూపొందించిన అభివృద్ధి అంశాలను వామపక్షాలతో తెలియపరుస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అక్రమ సంపాదనపై కమిషన్ వేసినా వేయకపోయినా, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. అక్రన సంపాదనపై రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ వేయడంతో ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని దేవేందర్ గౌడ్ ఆరోపించారు.
మరిన్ని
వ్యవ'సాయం' చేయండి: కేంద్రాన్ని కోరిన రాష్ట్రం
తీవ్రవాదానికి 71,000 మంది బలి: సీబీఐ
దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్ళు
అమ్మవారి సన్నిధికి వైఎస్సార్
సీఎం పదవిని లోకాయుక్త పరిధిలోకి తేవాలి
ఆటోలకు ప్రత్యామ్నాయంగా టాక్సీలు: వైస్సార్