కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం పరువు నానాటికీ దిగజారి పోతుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. నిర్ధిష్టమైన విదేశాంగ విధానం లేకుండా యూపీఏ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన ఆదివారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు.
భారత్-అమెరికా అణు ఒప్పందం అంశంలో కేంద్రం అనుసరించిన వైఖరి వల్ల దేశ ప్రతిష్ట దిగాజరిపోయిందని చెప్పారు. యూపీఏ-లెఫ్ట్ సంకీర్ణ భాగస్వామ్యంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడిచినా, సంకీర్ణ పార్టీల మధ్య ఏనాడూ సయోధ్య కుదరలేదని ఆయన ఎద్దేవా చేశారు.
|