ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ది: సీఎం
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే నిజమైన పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. నగరంలో ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ది శాఖ, ఆసియా డెవలెప్‌మెంట్ బ్యాంకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ చర్యలన్నీ ప్రభుత్వమే నిర్వహించలేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధల భాగస్వామ్యలతోనే ఇది సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్భన్ రీనివాల్ మిషన్ దేశంలోని 63 పట్టణాలకు ప్రాధమిక సదుపాయాలను కలుగజేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక లక్ష కోట్ల రూపాయలతో కేంద్రం నిర్ధేశించిన పట్టాణాలలో మౌలిక సదుపాయాలు కలుగజేస్తుందని ఆయన తెలిపారు. మిగతా దేశాలతో పోల్చిచూస్తే మన దేశంలో పట్టణాభివృద్ది పెరుగుదల శాతం తక్కువగా ఉందని రాజశేఖర రెడ్డి అన్నారు.
మరిన్ని
ఛార్జీల మోతమోగించనున్న ఆర్టీసీ
అవినీతిమయమైన కాంగ్రెస్ సర్కారు: కడియం
వరి మద్దతు ధర వెయ్యికి పెంచాలి: రైతు సంఘాలు
మెట్రో రైలుకు నిధులు పెంపు యోచన: జైపాల్
20న ప్రధాని మన్మోహన్‌తో బాబు భేటి
వెంకట్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు