రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలిపారు. రాజీవ్ యువశక్తి పథకం అమలుపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యువతకు ఉపాధి కల్పించేందుకు పావలా వడ్డీకే రుణాలు అందిచాలని నిర్ణయించామని అన్నారు.
హైదరాబాదుకే పరిమితమైన సెట్విన్ సర్వీసులును రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామన్నారు. ఈ ఏడాదీ రూ. 70 కోట్లను యువత ఉపాధి కోసం కేటాయించామని, అదనంగా మరో రూ. 70 కోట్ల నిధులను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శి ఎస్.ఎన్.మహంతి, కమిషనర్ అనంతరాము తదితరులు పాల్గొన్నారు.
|