ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
కిడ్నాప్ అయిన బ్యాంక్ మేనేజర్ హత్య
గురువారం రాత్రి కిడ్నాప్ అయిన బ్యాంక్ మేనేజర్ కేకే ప్రసాద్ సగం తగలబడిన మృత దేహం జిల్లాలోని రేవిడి గ్రామంలో శనివారం దొరికింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ ద్వారకానగర్ బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రసాద్ గురువారం రాత్రి కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే.

కేకే ప్రసాద్‌ను కిడ్నాప్ చేసిన ఆగంతకులు ఆయనను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని పెట్రోలు పోసి తగులబెట్టారని పోలీసులు తెలిపారు. హత్య వెనుక రియల్టర్ల హస్తం ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నాటకకు చెందిన 43 సంవత్సరాల ప్రసాద్ బదిలీపై విశాఖపట్టణానికి వచ్చారు.

ప్రసాద్ హత్య పట్ల అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ) తీవ్ర దిగ్బ్రాంతిని తెలిపింది. కిడ్నాప్ అయిన ప్రసాద్‌ను వెదకడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏఐబీఓసీ కార్యదర్శి కే రామకోటేశ్వరరావు ఆరోపించారు. దోషులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేసారు.
మరిన్ని
అసెంబ్లీ ఎదుట ప్రతిపక్షనేతల అరెస్టు
యువత ఉపాధికి పెద్దపీట: ముఖ్యమంత్రి
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ది: సీఎం
ఛార్జీల మోతమోగించనున్న ఆర్టీసీ
అవినీతిమయమైన కాంగ్రెస్ సర్కారు: కడియం
వరి మద్దతు ధర వెయ్యికి పెంచాలి: రైతు సంఘాలు