వరికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 23, 24 తేదీల్లో ప్రధానిని కలువనున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి కె. శ్రీహరి పేర్కొన్నారు.
బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వినతి చేస్తారని శ్రీహరి మీడియాతో వెల్లడించారు.
వరికి కనీస మద్దతు ధరలో భాగంగా క్వింటాల్‌కు వెయ్యి రూపాయల ధరను కల్పించాలని ప్రధానితో వినతి చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన రైతు సంక్షేమ సంఘాలతో తెదేపా వరి మద్దతు ధరపై రైలు, రాస్తారొకొలను నిర్వహించనున్నట్లు శ్రీహరి పేర్కొన్నారు.
|