ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: షబ్బీర్ ఆలీ
పొట్టకూటి కోసం గల్ఫ్‌కు వెళ్లి చిక్కుల్లో చిక్కుకున్న వారిని ప్రభుత్వ సొంత ఖర్చుల్తో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కాబినెట్ నిర్ణయించిందని మంత్రి షబ్బీర్ ఆలీ చెప్పారు. గల్ఫ్ బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని, అయితే వీటికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదన్నారు. అందువల్ల గల్ఫ్‌లోని భారత రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న వారిని ప్రభుత్వ రాష్ట్రానికి తీసుకొస్తుందని, ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపి.జౌహారిని ఆదేశించినట్టు మంత్రి ఆలీ చెప్పారు.

ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర కాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి 5.652 శాతం కరవు భత్యం (డీఏ) చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందన్నారు. దీనివల్ల 13,45,879 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వంపై రూ.645.75 కోట్ల అదనపు భారం పడనుంది.
మరిన్ని
గోసంరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం
వరికోసం ఢిల్లీకి వైఎస్: క్యాబినేట్
మూడేళ్లలో 2.18 లక్షల విద్యుత్ కనెక్షన్లు
తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు 22నుంచి
వరి "మద్దతు"కై ఢిల్లీకి: తెదేపా
జన్మభూమిలోనే కొత్త జీవితం: శ్రీజ