కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన వీరప్ప మొయిలీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. విమానశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. ఎంపీ అంజన్ కుమార్, ఎమ్మెల్యే పి.జనార్థన్ రెడ్డి వర్గానికి చెందిన కార్యకర్తలు బాహాబాహికి దిగారు.
అనంతరం హైదరాబాద్ బ్రదర్స్‌గా పేరుగాంచిన ఎమ్మెల్యేలు పి.జనార్థన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలు మొయిలీతో లేక్‌వ్యూ అతిథి గృహంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు బేగంపేట విమానశ్రయానికి వచ్చిన మొయిలీకి పిసిసి తాత్కాలిక చీఫ్ జీఎస్.రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీపిరామచంద్రరావు, పార్టీకి చెందిన ఇతర నేతలు స్వాగతం పలికారు.
|