ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
వరి మద్దతు ధరపై రఘువీరా అత్యవసర భేటి
వరికి మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్ రాష్ట్రంలో రోజురోజుకు మరింత ఉధృతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ శాఖలతో వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో మద్దతు కల్పనపై ప్రత్యేకంగా చర్చలు జరిపినట్టు అధికారవర్గాల సమాచారం.

అంతేకాకుండా ఇప్పటికే ఓ బృందం కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించిన విషయం తెల్సిందే. వరికి మద్దతు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్సార్ కేంద్రాన్ని ఒప్పించగలరని మంత్రి రఘువీరా ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం వచ్చేనెల రెండో తేదీన ముఖ్యమంత్రి వైఎస్సార్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌లను కలుసుకుంటారని మంత్రి చెప్పారు.
మరిన్ని
హైదరాబాద్‌కు వచ్చిన మొయిలీ: ఘనస్వాగతం
గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: షబ్బీర్ ఆలీ
గోసంరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం
వరికోసం ఢిల్లీకి వైఎస్: క్యాబినేట్
మూడేళ్లలో 2.18 లక్షల విద్యుత్ కనెక్షన్లు
తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు 22నుంచి