కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. వరికి మద్దతు ధరగా వెయ్యి రూపాయలను కల్పించాలని ఈ సందర్భంగా చంద్రబాబు పవార్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పవార్ బాబుకు హామీ ఇచ్చినట్టు ఇచ్చారు.
వరికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఢిల్లీకి వెళ్లి సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చర్చలు జరిపుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు వెంట పలువురు తెదేపా నేతలు కూడా ఉన్నారు.
|