ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
రెండో ఎస్సార్సీకే కాంగ్రెస్ మొగ్గు: మొయిలీ
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జిగా నియమితులైన కర్ణాటక నేత వీరప్ప మొయిలీ నోటి వెంట ప్రత్యేక తెలంగాణా మాటలు వెలువడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదంటూనే.. కొత్త పల్లవి పాడారు. ప్రత్యేక తెలంగాణా కోసం.. రెండో ఎస్సార్సీ ఏర్పాటు పట్లే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సుముఖంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.

పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులైన మొయిలీ బుధవారం తొలిసారిగా హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన లేక్‌వ్యూ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణా రెండో ఎస్సార్సీనే సాధ్యమని పేర్కొన్నారు. దీని ఏర్పాటు అనేది రాజ్యాంగ పరమైన అంశమని, అందువల్ల ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించనున్నట్టు మొయిలీ వివరణ ఇచ్చారు.
మరిన్ని
మంత్రి పవార్‌ను కలసిన చంద్రబాబు
వరి మద్దతు ధరపై రఘువీరా అత్యవసర భేటి
హైదరాబాద్‌కు వచ్చిన మొయిలీ: ఘనస్వాగతం
గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం: షబ్బీర్ ఆలీ
గోసంరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం
వరికోసం ఢిల్లీకి వైఎస్: క్యాబినేట్