ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
నవంబర్ ఐదు నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నవంబర్ ఐదు నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే శాసనమండలి సమావేశాలు నవంబర్ ఆరు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రగవర్నర్ ఎన్‌.డి.తివారీ ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అధికార ప్రకటన వెల్లడించింది.

పన్నెండవ శాసనసభ తాలూకు పన్నెండవ సమావేశంగా శీతాకాలపు సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించున్నాయి. ఇటీవల ఏర్పాటైన శాసనమండలికి ఇది మూడవ సమావేశం కానున్నది. శీతాకాలపు సమావేశాలను పురస్కరించుకుని అధికార ప్రతిపక్షాలు తమ అజెండాలను సిద్దం చేసుకుంటున్నాయి.

లుంబినీ పార్కు, గోకుల్ చాట్ బండార్ బాంబు పేలుళ్ళతో రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, 610 జీవో అమలులో జాప్యం, ఇందిరమ్మ ఇళ్ళలో అక్రమాలు, వరికి వెయ్యి రూపాయల గిట్టుబాటు ధర తదితర అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.
మరిన్ని
ప్రతి కలెక్టరుతో సీఎం ముఖాముఖి సమావేశం
నాలుగు జిల్లాల్లో 260 చెరువులకు గండ్లు
జలదిగ్భంధంలో సింహపురి: మృతులు 40 మంది
స్థిరంగా అల్పపీడనం.. తొలగని వర్షం ముప్పు
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా: వైఎస్సార్
విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులదే: సీఎం