ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
పదవీకాలానికి లాటరీ కొట్టిన ఎమ్మెల్సీలు
సుధీర్ఘకాలం తర్వాత ఏర్పాటు కాబడిన శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి సభ్యుల (ఎమ్మెల్సీలు) పదవీకాలం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో గల జూబ్లీ హాల్‌లో శాసన సభ కార్యదర్శి తుల్జానంద్ సింగ్ లాటరీ తీశారు.

ఎమ్మెల్సీల పదవీకాలాన్ని ప్రకటించారు. లాటరీ పద్దతి సరికాదంటూ కొందరు ఎమ్మెల్సీలు కోర్టుకెక్కినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

లాటరీలో పదవీ కాలాన్ని దక్కించుకున్న ఎమ్మెల్సీల వివరాలు ఇలా ఉన్నాయి:

రెండు సంవత్సరాలలో పదవీకాలాన్ని పూర్తి చేసుకునే స్థానిక సంస్థల ఎమ్మెల్సీల

జి.తిప్పేస్వామి, కనుమూరి బాపిరాజు, రహమాన్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నేతి విద్యాసాగర్, రేవంత్ రెడ్డి, కిదారి సర్వేశ్వరరావు, ఎండీ సుల్తాన్ అహ్మద్, సింగం బసవపున్నయ్య, మాణిక్యరావు, ఆర్.బసవరాజు, రుద్రరాజు పద్మరాజు, అమోస్

నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని పొందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీల

మల్లుల లక్ష్మినారాయణ, మసాల పద్మజ, సయ్యద్ అల్తార్ రజ్వీ, పువ్వాడ నాగేశ్వరరావు, బి.చెంగల్రాయుడు, మహ్మద్ జానీ, ఎం.లక్ష్మీదేవి, కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.గోపీనాథ్, బొమ్మిడి నారాయణరావు, పాలడగు వెంకట్రావు, జి.హరిబాబు నాయుడు, టి.శ్రీనివాసులు, సి.హెచ్.గంగాభవాని.

ఆరు సంవత్సరాల అనంతరం పదవీవిరమణ చేసే స్థానిక సంస్థల ఎమ్మెల్సీల

వాసిరెడ్డి వరదరామారావు, దాడి వీరభద్రరావు, పొగాకు యాదగిరి, సిద్ధ రాఘవరావు, ఇంద్రసేన్‌రెడ్డి, భారతి, పొంగులేటి సుధాకరరెడ్డి, పద్మావతి, జల్లి విల్సన్, చేరుపల్లి సీతారాములు, అబ్ధుల్లా, లక్ష్మీదుర్గేష్ ప్రసాద్, నిమ్మకాయల చినరాజప్ప, టీజీవీ కృష్ణారెడ్డి, కె.జయచంద్రనాయుడు, వీవీరామారావు, కె.ప్రేమ్‌సాగరరావు, రాయపాటి శ్రీనివాస్
మరిన్ని
పీసీసీ నియామకంపై మాట్లాడను: వైఎస్సార్
భూ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీపీఐ
ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన వైఎస్సార్
త్వరలోనే మహామండప నిర్మాణం: తితిదే
ధనయజ్ఞానికే తాము వ్యతిరేకం: చంద్రబాబు
వరదబాధితులను ఆదుకుంటాం: వైఎస్