ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
ఆటోలకు డిజిటల్ మీటర్లు ఖాయం: మంత్రి కన్నా
ఆటోలకు డిజిటల్ మీటర్లను తప్పకుండా బిగించుకోవాల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ నెల పదోతేదీ వరకే డిజిటల్ మీటర్లను బిగించేందుకు తుది గడువని... డిజిటల్ మీటర్లను బిగించని ఆటోలను అనంతరం సీజ్ చేస్తామని కన్నా హెచ్చరించారు.

డిజిటల్ మీటర్ల వ్యవహారంలో రాజీపడే ప్రసక్తేలేదని కన్నా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. డిజిటల్ మీటర్లు ఆర్థికంగా ఆటో డ్రైవర్లకు భారం కాకుండా ఉండేందుకు ఏర్పాటు చేశామని కన్నా వివరించారు. ఈ వ్యవహారంలో ఆటోయూనియన్ వాదనలో అర్థం లేదని మంత్రి తెలిపారు.
మరిన్ని
పదవీకాలానికి లాటరీ కొట్టిన ఎమ్మెల్సీలు
పీసీసీ నియామకంపై మాట్లాడను: వైఎస్సార్
భూ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీపీఐ
ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన వైఎస్సార్
త్వరలోనే మహామండప నిర్మాణం: తితిదే
ధనయజ్ఞానికే తాము వ్యతిరేకం: చంద్రబాబు