ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
ఆటోడ్రైవర్ల సమ్మెలో అరెస్టుల పర్వం
జంటనగరాలలో డిజిటల్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆటోడ్రైవర్లు చేస్తున్న సమ్మెలో అరెస్టులు చోటు చేసుకున్నాయి. తమ నిరసన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీని శనివారం చేపట్టాలని ఆటోడ్రైవర్లు నిర్ణయించారు.

ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని భగ్నం చేశారు. ర్యాలీని కొనసాగించడానికి ప్రయత్నంచిన ఆటో సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆటో సంఘం సెక్రటరీ ఉమా మహేశ్వరరావు, సత్యనారాయణ, నాగేష్, బలరాం, భరత్‌ నాయక్, అరుణ తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా ఆటో డ్రైవర్ల సమ్మెపై ప్రజాసంఘాలు సైతం స్పందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆటోడ్రైవర్ల సమ్మెపై ముఖ్యంగా ఆటోలకు డిజిటల్ మీటర్ల ఏర్పాటుపై ఆదివారం హైదరాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు జన విజ్ఞాన వేదిక ప్రకటించింది.
మరిన్ని
ఆటోలకు డిజిటల్ మీటర్లు ఖాయం: మంత్రి కన్నా
పదవీకాలానికి లాటరీ కొట్టిన ఎమ్మెల్సీలు
పీసీసీ నియామకంపై మాట్లాడను: వైఎస్సార్
భూ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీపీఐ
ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన వైఎస్సార్
త్వరలోనే మహామండప నిర్మాణం: తితిదే