ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
సీఎంను కలవలేకపోయిన శ్రీజ దంపతులు
FileFILE
ప్రేమ వివాహం ద్వారా దేశవ్యాప్తంగా వార్తలకెక్కిన శ్రీజ దంపతులకు, రాష్ట్రముఖ్యమంత్రి డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తమకు రక్షణ కావాలంటూ ముఖ్యమంత్రికి విన్నవించుకోవడానికి ఆయన అపాయింట్‌మెంట్ కోరినట్లు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ శనివారం ఏపీ భవన్ వద్ద మీడియాతో అన్నారు.

ముఖ్యమంత్రిని కలిసే నిమత్తం శనివారం సాయంత్రం ఐదు గంటలకు అపాయింట్‌మెంట్ ఇవ్వవలసిందిగా కోరామని శ్రీజ తెలిపారు. అయితే సంబంధిత అధికారుల నుంచి అందుకు అనుకూలమైన సమాచారం రాకపోవడంతో తాము ఏపీ భవన్‌కు వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

ఏపీ భవన్‌లో రాష్ట్రావతరణ దినోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్, శ్రీజ దంపతులు అక్కడకు రాకముందే విందు నిమిత్తం వెళ్ళిపోయారు. అయితే ఉత్సవాలను వీక్షించేందుకు వచ్చిన తెలుగు ప్రజలకు శ్రీజ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇదిలా ఉండగా దంపతులకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై ముఖ్యమంత్రి, చిరంజీవి అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా కోరగా మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాని చిరంజీవి అన్నట్లు ముఖ్యమంత్రి అధికారులు వెల్లడించారు.
మరిన్ని
ఆటోడ్రైవర్ల సమ్మెలో అరెస్టుల పర్వం
ఆటోలకు డిజిటల్ మీటర్లు ఖాయం: మంత్రి కన్నా
పదవీకాలానికి లాటరీ కొట్టిన ఎమ్మెల్సీలు
పీసీసీ నియామకంపై మాట్లాడను: వైఎస్సార్
భూ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీపీఐ
ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన వైఎస్సార్