అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. అదే సమయంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై అధికార కాంగ్రెస్ శాసనసభా పక్షం సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రతిపక్షాల విమర్శలను, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది.
అయితే.. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రధానంగా చర్చ సాగాలని ముఖ్యమంత్రి వైఎస్సార్ పిలువునిచ్చారు. రాజకీయాలు బయట మాట్లాడుకోవచ్చని, ఏ పార్టీకి చెందిన సభ్యుడైనా అడిగే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తుందని ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుండగా.. వరికి కనీస మద్దతు ధర, జలయజ్ఞంలో చోటు చేసుకున్న అవకతవకలు, లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్ బండార్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుతో రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం తదిర అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంది.
|