ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్
అసెంబ్లీ వాయిదాకు అనంతరం స్పీకర్ ఏర్పాటు చేసిన బిఏసీ సమావేశంలో తమపై ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విలేకరులతో చెప్పారు.

అసెంబ్లీ సమావేశంలో ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై చర్చ జరిపేందుకు ఏర్పాటయిన బిఏసీ సమావేశంలో భాగంగా... వరికి మద్దతు ధర, అసెంబ్లీ సమావేశాలను మరో మూడో రోజులు పొడిగించాలని బాబు విజ్ఞప్తి చేశామని బాబు తెలిపారు.

అయితే రైతుల గురించి మాట్లాడే అధికారం తమకు లేదని... ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని బాబు అన్నారు. అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత వర్షాకాలపు ఎన్నికల్లోనూ వైస్సార్ ఇదేవిధంగా వ్యక్తిగత దూషణలకు దిగారని వెల్లడించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇటువంటి ప్రస్తావనకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బాబు అన్నారు.
మరిన్ని
రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలకు సర్వం సన్నద్ధం
సీఎంను కలవలేకపోయిన శ్రీజ దంపతులు
ఆటోడ్రైవర్ల సమ్మెలో అరెస్టుల పర్వం
ఆటోలకు డిజిటల్ మీటర్లు ఖాయం: మంత్రి కన్నా