ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
వైఎస్ అనుచిత వ్యాఖ్యలు: తెదేపా నేతల మౌన నిరసన
సోమవారం ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాలకు అనంతంర ఏర్పాటయిన బిఏసీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును నిరసిస్తూ... ఆ పార్టీ నేతలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మౌన నిరసన చేపట్టారు.

ఈ మౌన నిరసన కార్యక్రమంలో తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, దేవేందర్ గౌడ్ తదితర పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. నోటికి అడ్డుగా వారు నల్లని వస్త్రాన్ని కట్టుకుని ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ప్రస్తావన చేయటాన్ని తెదేపా తీవ్రంగా ఖండించింది. ఈ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెదేపా ధ్వజమెత్తింది.
మరిన్ని
చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్
రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలకు సర్వం సన్నద్ధం
సీఎంను కలవలేకపోయిన శ్రీజ దంపతులు
ఆటోడ్రైవర్ల సమ్మెలో అరెస్టుల పర్వం