ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
ఎమ్మెల్యే సభ్యత్వానికి వంగవీటి రాధా రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ (తూర్పు) నియోజకవర్గం ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డికి ఆయన ఫ్యాక్స్‌లో పంపారు. తన తండ్రి వంగవీటి రంగా హత్య కేసులో నిందితులుగా ఉన్న కంకిపాడు నియోజకవర్గ అధికార పార్టీ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ, అయన అనుచరులకు రాజధాని హైదరాబాదులో సుమారు రూ.120 కోట్ల విలువ చేసే భూమిని కేటాయించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందుకు నిరసనగానే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. పేదలకు 100 గజాల ఇంటి స్థలం కోసం చేపట్టిన నిరాహార దీక్షాశిబిరంలోనే తన తండ్రి 1988 హత్యకు గురయ్యారని, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని పేర్కొన్నారు.

అయితే.. హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పించడమేగాక, 1999 ఎన్నికల్లో పార్టీ తరపున బరిలోకి దిగడానికి టికెట్లు కూడా లభించడంతో కేసు నీరుగారిందని ఆయన తన రాజీనామా లేఖలో అసంతృప్తిని బయటపెట్టారు.
మరిన్ని
9న తెదేపాలో చేరనున్న కొమ్మి
స్పీకర్‌ వ్యవహారశైలిపై చంద్రబాబు ఆగ్రహం
నేనూ ఉప్పూ.. కారం తింటున్నా: వైఎస్సార్
మళ్లీ వాయిదా పడిన అసెంబ్లీ: స్పీకర్ అసహనం
సభను తప్పుదారి పట్టించేందుకే రభస: వైఎస్
చంద్రబాబుపై కన్నా లక్ష్మీ నారాయణ ధ్వజం