మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై దాఖలైన బహు భారత్వం కేసును విశాఖ పట్నం అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం మరో మారు వాయిదా వేసింది. కేసు విచారణ సమయంలో పూర్తి సాక్ష్యాధారాలను పోలీసులు ప్రవేశట్టలేక పోవడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనికి పోలీసుల తరపు న్యాయవాది హాజరై.. పాస్‌పోర్టు అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించడంలో జాప్యం జరుగుతోందని అందువల్ల పూర్తి ఆధారాలను ప్రవేశ పెట్టలేక పోతున్నట్టు వివరించారు. దీనికి సంతృప్తి చెందని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ.. కేసును వచ్చే 22వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోగా తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు అప్పగించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.
|