అవినీతి నిరోధక శాఖ వలలో మహబూబ్ నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదివారం చిక్కుకున్నారు. రూ. 10 లక్షల రూపాయలను లంచం రూపంలో స్వీకరిస్తున్న రంజిత్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ముందుగా అందుకున్న ఫిర్యాదు మేరకు కల్లు దుకాణం లైసెన్సు పునరుద్ధరణ కోసం అర్జున్ గౌడ్ నుంచి లంచం స్వీకరిస్తున్న రంజిత్‌ను అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. రంజిత్ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.
ఇదిలా ఉండగా 1999 సంవత్సరంలో లంచం తీసుకున్న ఆరోపణలపై రంజిత్ అరెస్టు అయ్యారు. ప్రస్తుత వ్యవహారంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణను జరుపుతున్నారు.
|