హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ ఏరియాలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలను కూల్చి చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. కొద్దిసేపు అధికారులకు, స్థానికులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ గృహాలను కూల్చి వేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ముందస్తుగా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఇళ్లు కూల్చడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వీటిని ప్రభుత్వ అధికారులు మాత్రం కొట్టి పారేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు నోటీసులు జారీ చేశామని వారు వివరణ ఇచ్చారు. తమ ఇళ్లను కూల్చడం వెనుక బడా బాబుల హస్తముందని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఏరియాలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
|