ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
 
మెగాస్టార్ 'చిరు' కొత్తపార్టీ...?
Chiranjeevi
FILE
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి దిగకూడదని పలు రాజకీయాలు చేసిన కొందరిని ఖంగుతినిపించేలా చిరంజీవి పావులు కదుపుతున్నారు. సోమవారం రాత్రి తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు మీడియా అధినేతలను ఆయన కలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబంలో జరిగిన సంఘటనలను వారితో చర్చించినట్లు సమాచారం. శ్రేయోభిలాషులు,మేథావులతో కూడా చర్చించిన మీదట తన రాజకీయ ప్రవేశాన్ని బయటపెట్టినట్లు తెలిసింది.

ఇప్పటివరకూ చిరంజీవి రాజకీయాల్లోకి రారనీ, ఆయనకు వచ్చే ధైర్యం కూడా లేదని చెప్పుకుంటున్న కొంతమందికి ఈ విషయం షాక్ లాంటిది. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాపు సంఘాలు, సిపీఐ, తెరాస, సి.పి.ఎం తదితర పార్టీలు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని ప్రకటించాయి.

వీరందరినీ కలుపుకుని పార్టీగా ఎదగాలనీ, బలహీన వర్గాలను, దళితులను సంఘటితం చేసే శక్తి చిరంజీవికి ఉందని ఆయన సన్నిహితులలో ఒకరైన ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్... చిరు రాజకీయ ప్రవేశం విషయమై స్పందిస్తూ... చిరంజీవి రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని ఎప్పటిలానే కొనసాగిస్తుందని తెలిపారు.
మరిన్ని
ఎమ్మెల్యేపై చర్యకు ఐఎంఏ డిమాండ్
మెడికోల సమ్మె: పెరుగుతున్న మృతుల సంఖ్య
నేడు మెడికోల రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఇప్పట్లో బస్సు చార్జీలు పెరగవ్: దినేష్ రెడ్డి
మరికొంత మంది రైతులకు పావలా వడ్డీ రుణాలు
నిలోఫర్ ఘటన ఓ విషాదం: వైఎస్