బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా నగరంలోని పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మఫ్టీలోని పోలీసులు అసాంఘిక శక్తుల కదలికలపై గురువారం నిఘా వేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా 'షాడో పోలీసు టీము'లను నియమించినట్లు చార్మినార్ సహాయక పోలీస్ కమీషనర్ రెడ్డన్న మీడియాతో అన్నారు.
తమ కార్యకలాపాలలో భాగంగా ద్విచక్ర వాహనంపై సంచరించే షాడో పోలీసు టీములు మొబైల్ కెమెరాల సహాయంతో అనుమానితుల కదలికలను రికార్డు చేస్తాయని రెడ్డన్న తెలిపారు. పాతబస్తీలోని ప్రతి వీధిలోను మరో ఇరవైనాలుగు గంటల పాటు విధుల నిర్వహించేలా టీములను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాక మొబైల్ కెమెరా టీములు అనుమానితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు చేరవేస్తాయని తెలిపారు.
|