ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాలారుపై ఆనకట్ట తథ్యం: వైఎస్సార్
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పాలారుపై ఆనకట్ట నిర్మిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. గురువారం చిత్తూరు జిల్లా కుప్పంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగింస్తూ.. పాలారు నదిపై ఆనకట్ట నిర్మించే ప్రాథమిక హక్కు మనకు ఉందన్నారు. ఆ ప్రాథమిక హక్కుతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామన్నారు.

అయితే.. దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన కేసు పెండింగ్‌‌లో ఉన్నందువల్ల ఆ అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభింస్తామన్నారు. ఇకపోతే తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అలాంటి పార్టీకి రైతుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదన్నారు.

ముఖ్యంగా.. తెదేపా అధినేత చంద్రబాబుకు పంచెకట్టుపై కనీస అవగాహన కూడా లేదన్నారు. అలాంటిది రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ప్రచారం చేసుకుంటే సరిపోతుదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందని తెలిపారు.
మరిన్ని
రమ్మన్నారు... వెళుతున్నాం....
త్వరలో రూ.2కు కిలో బియ్యం పథకం: సీఎం
మొబైల్ కెమెరాలతో పోలీసుల నిఘా
మెగా 'పార్టీ'పై 'మెగా' వార్తలు
మావోయిస్టు అగ్రనేత సాగర్ అరెస్టు
కొలిక్కి రాని జూనియర్ డాక్టర్ల సమ్మె