ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ధూల్‌పేట వాసులకు పునరావాసం : వై.ఎస్
నగరంలోని ధూల్‌పేటలో అక్రమంగా మద్యం తయారీ చేస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధితో పునరావాసం కల్పించవలసిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశించారు. 'రాజీవ్ యువశక్తి' పథకం ద్వారా ధూల్‌పేట వాసులకు పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

సంబంధిత పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 20 శాతం సబ్సిడీకి అదనంగా మరో 20 శాతం సబ్సిడీని ఎక్సైజ్ శాఖ్ కల్పిస్తుంది. మిగిలిన 60 శాతాన్ని రుణాల రూపేణా బ్యాంకులు అందచేస్తాయి. అదే విధంగా బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం ద్వారా ధూల్‌పేట వాసులకు ఇళ్లు అందించవలసిందిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు
మరిన్ని
సాంకేతిక నిపుణులకు ఉపాధి : చెంగారెడ్డి
జూనియర్ డాక్టర్లను సమ్మె విరమించమన్న సీఎమ్
ఇకమీదట అటువంటి పరిస్థితి రాదు: బాబు
తెలంగాణా కోసం అధిష్టానంపై ఒత్తిడి: పురుషోత్తం
రాజీవ్ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించిన సీఎమ్
త్వరలో శ్రీవారి భూముల సర్వే : తితిదే