ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం: చంద్రబాబు
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ధనార్జన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏరువాకలో భాగంగా ఆయన రెండో రోజు విశాఖపట్నం జిల్లాలో పలు రోడ్‌షోలలో పాల్గొన్నారు. అనంతరం పాయకరావు పేటలో నిర్మిస్తున్న ఆనకట్ట పనులను పరిశీలించారు. ఆనకట్టలో నాణ్యతా లోపాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తాండవనదిపై నిర్మించిన ఆనకట్టలో నాసికరకపు పనులు చేశారన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి బంధువులకే అప్పగించడం ప్రజాధనం దోపిడీకి నిదర్శనమన్నారు. వరికి కనీస మద్దతు ధరపై చేపట్టిన ఉద్యమాన్ని వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా జైపూర్, రాంచీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌లలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు.
మరిన్ని
తెలంగాణాపై తుది నిర్ణయం సోనియాదే: వైఎస్సార్
సాగునీటి నిధుల్లో సింహభాగం తెలంగాణాకే: వైఎస్
నేడు తెదేపా నిరాహార దీక్షలు
బీఎస్పీలో నరేంద్ర చేరికకు రంగంసిద్ధం
ఎట్టకేలకు విధులకు హాజరైన జూనియర్ డాక్టర్లు
సమ్మె నోటీసు జారీ చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాలు