ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పెట్రోల్ ధరల పెంపును అడ్డుకుంటాం: తెదేపా
పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాసు ధరలను పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో తాము తీవ్రంగా అడ్డుకుంటామని తెలుగుదేశం పార్లమెంటరీ పక్షం పేర్కొంది. పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను మరియు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా సామాన్యులపై భారం మోపకుండా చర్యలు తీసుకోవాలని యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రాలు విధిస్తున్న పన్ను విధానాన్ని పునఃసమీక్షించడం ద్వారా సామాన్యులపై ధరల పెరుగుదల భారం పడకుండా చూసేలా కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత కే ఎర్రంనాయుడు ఒక ప్రకటనలో కోరారు. ధరల పెరుగదలను అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తాయని ఆయన అన్నారు.

గడచిన మూడున్నర సంవత్సరాల తన పాలనలో యూపీఏ ప్రభుత్వం ఆరు సందర్భాలలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచిన వైనాన్ని ఎర్రంనాయుడు తన ప్రకటనలో ప్రస్తావించారు.
మరిన్ని
జలయజ్ఞం పూర్తి చేస్తాం: పొన్నాల
గుంటూరులో ఆయుధాల డంప్ స్వాధీనం
బెల్లంకొండ జెడ్‌పీటీసీని గెలుచుకున్న కాంగ్రెస్
చిత్తూలు మాజీ ఎమ్మెల్యేపై బాంబు దాడి
ప్రభుత్వ ఖాళీలు కొత్త సంవత్సరంలో భర్తీ: వైఎస్
ప్రత్యేక తెలంగాణా ఇవ్వాల్సిందే: కాకా