ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ అదనపు బస్సులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా 3,350 బస్సులను నడుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్‌టీసీ) ప్రకటించింది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కే ఎస్ నాగరాజారావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కోస్తా, రాయలసీమ మరియు తెలంగాణా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

అదేసమయంలో నగరంలోని మహాత్మా గాంధీ బస్సు టెర్మినల్‌కు ప్రయాణికులు తాకిడిని నివారించేందుకు, ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల పోకలను ఇతర బస్సు టెర్మినల్‌లకు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణా ప్రాంతాలకు దారితీసే బస్సులను అందుకునే ప్రయాణికులు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ మరియు మెహిదీ పట్నంను వినియోగించుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ బస్సుల కన్నా ఆర్టీసీ తక్కువ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని
డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరిస్తాం: వై ఎస్
చిరంజీవిని స్వాగతిస్తాం: మొయిలీ
రెండో ఎస్సార్సీ అంటే ప్రజలను మోసగించడమే: వెంకయ్య
పేదరికం లేని నవ సమాజ స్థాపనకు కృషి: బాబు
త్వరలో గ్రామీణ రెవిన్యూ అధికారుల నియామకం: ధర్మాన
బీపీఎల్ కుటుంబాలకు 2.42 లక్షల టన్నుల బియ్యం