ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాజశేఖర్‌పై దాడితో సంబంధం లేదు: బచ్చు రాజా
సినీ నటుడు రాజశేఖర్‌పై జరిగిన దాడికి, తనకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన బచ్చు రాజా స్పష్టం చేశాడు. దాడి జరిగిన సమయంలో అసలు తాను హైదరాబాద్‌లోనే లేనని పేర్కొన్నాడు. ఈ దాడి కేసులో తన ప్రమేయం కూడా ఉన్నట్టు మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమని బచ్చు రాజా వాపోయాడు. సోమవారం ఉదయం భీమవరం నుంచి సికింద్రాబాద్‌కు స్టేషన్‌ వచ్చిన తర్వాత కారులో వెళుతున్న రాజశేఖర్‌పై నటుడు చిరంజీవి అభిమానులు దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అంతేకాకుండా దాడి వార్త తెలుసుకున్న మరుక్షణమే మెగాస్టార్ జూబ్లీహిల్స్‌లోని రాజశేఖర్ దంపతులకు నివాసానికి వెళ్లి క్షమాపణలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో దాడి కేసులో చిరు అభిమానులను కొంతమంది పంజాగుట్ట పోలీసులకు లొంగిపోయారు. అయితే కూకట్ పల్లికి చెందిన బచ్చూరాజా పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ దాడి జరిగిన రోజున తాను నగరంలో లేనని, ఇటీవలే తన తల్లి మృతి చెందడంతో ఊరికి వెళ్లి వున్నానని పేర్కొన్నాడు. అలాగే.. తనను వడ్డేపల్లి అనుచరుడిగా పేర్కొనడం ఆశ్చర్యంగా వుందన్నారు.
మరిన్ని
సీపీఎంలో బ్రాహ్మణులకు రిజర్వేషన్ల కేటాయింపుపై చర్చ
ఢిల్లీ వెళ్లనున్న వైఎస్.. వాయిదా పడిన మంత్రివర్గ సమావేశం
రాజశేఖర్‌పై దాడి కేసు: లొంగిపోయిన నిందితులు
అవసరమైతే రాజశేఖర్‌కు భద్రత: హోంమంత్రి
రాబోయే ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీఠ: సీఎం
చంపుకోవడం రాజకీయం కాదు: జీవిత