సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తులో ఊపందుకున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన మెగాసోదరుడు నాగేంద్ర బాబు, బావమర్థి అల్లు అరవింద్‌లు చిరు అభిమాన సంఘాలకు చెందిన కీలక నేతలతో రహస్య మంతనాలు నిర్వహించారు. ఈ రహస్య సమావేశం కూడా రాజమండ్రి నుంచి పేరంటాలపల్లికి వెళ్ళేందుకు లాంఛీల్లో జరగడం విశేషం. దీంతో సమావేశ అంశాలు వెలుపలికి పొక్కలేదు.
అంతేకాకుండా మండల, గ్రామీణ స్థాయిల్లో చిరు అభిమాన సంఘాల పేరిట ప్రజా సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేయాలని వారు అభిమాన సంఘాల నేతలకు పిలుపునిచ్చినట్టు సమాచారం. అలాగే మండలస్థాయిలో చిరు అభిమానులపై నిఘా వ్యవస్థ ఏర్పాటు, చిరంజీవి పార్టీకి కులముద్ర పడేలా చేయడం వంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారు అభిమానులకు పిలుపునిచ్చారు.
|