|
డబ్బుకోసం కిడ్నాప్: రూ. 5.5 లక్షలు దోపిడి
|
|
|
|
|
సోమవారం, 18 ఫిబ్రవరి 2008( 13:30 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో శనివారం కిడ్నాపు కాబడ్డ రైసు మిల్లు యజమాని సుధాకర్ తీవ్రగాయాలపాలై డిఆర్డీఎల్ అపోలో ఆసుపత్రిలో కనబడ్డాడు. సంగమేశ్వర్ రైసు మిల్లును నిర్వహిస్తున్న సుధాకర్ ధాన్యాన్ని కొని వాటిని బియ్యంగా మార్చి ఎఫ్‌సిఐ జహీరాబాద్ శాఖకు సరఫరా చేస్తుంటాడు. దానికి సంబంధించిన చెల్లింపులను ఎఫ్‌సీఐ చెక్కు రూపంలో ఎస్ఆర్ నగర్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో ఇస్తుంటుంది.
ఈ క్రమంలో అతను శనివారం ఐదున్నర లక్షల రూపాయల చెక్‌ను బల్కంపేట స్టేట్ బ్యాంక్‌లో డ్రా చేశాడు. అతను డబ్బు సంచి తీసుకుని బయటకు వస్తుండగా.. అంతలో ఓ తెల్లరంగు మారుతీ వ్యాన్‌లో వచ్చిన దుండగులు అతనిని కిడ్నాప్ చేశారు. అతను తేరుకోక మునుపే బాగా కొట్టి అనంతరం హత్యాయత్నం చేశారు. సుధాకర్ బతిమాలటంతో అతనిని వ్యాన్ నుంచి బయటకు తోసేశారు. చివరికి ఎలాగో నగరానికి చేరుకుని ఆసుపత్రిలో చికిత్సకోసం చేరాడు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|