|
కాంగ్రెస్-తెదేపా దొందూ దొందే: భాజపా
|
|
|
|
|
మంగళవారం, 19 ఫిబ్రవరి 2008( 20:50 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ దొందూ దొందేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది. అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీగా తెదేపాలు పూర్తిగా విఫలమయ్యాని భాజపా ఆరోపించింది. భాజపా రాష్ట్ర శాఖ కార్యవర్గ సమావేశాలు మంగళవారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఇందులో ఆ పార్టీ సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్‌లతో రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అత్యంత కీలక అంశాలపై చర్చ సాగనుంది.
ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ, కేంద్ర, రాష్ట్రాల్లో ముందస్త ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశాల ప్రారంభానికి ముందు భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. వరికి వెయ్యి రూపాయల మద్దతు ధర కల్పించడం వెనుక భాజపా కృషి ఎంతగానే ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత పూర్తిగా కరువైందని, బీఫార్మసి విద్యార్థిని ఆయేషా హత్య కేసు విచారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండారు విమర్శించారు.
|