|
మదర్‌థెరిస్సా స్ఫూర్తితో ప్రజాసేవ చేద్దాం: నాగబాబు
|
|
|
|
|
|
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2008( 17:38 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | మదర్‌థెరిస్సా స్ఫూర్తితో చిరంజీవి అభిమానులు ప్రజాసేవకు పునరంకితులు కావాలని చిరంజీవి సోదరుడు నాగబాబు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లాలో నాగబాబు తొలిసారిగా చిరు అభిమానుల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం మొదలుకొని హనుమాన్ జంక్షన్ వరకూ పాదయాత్ర చేశారు.
మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్‌లో మదర్‌థెరిస్సా విగ్రహాన్ని ఆవిష్కరించి, అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. అనంతరం బహిరంగ సమావేశంలో అభిమానులతో మాట్లాడుతూ, మంచి పనులతో అన్నయ్య చిరంజీవికి మంచి పేరు తేవాలని కోరారు. ఆ తర్వాత గొల్లపల్లిలో జరిగిన మదర్‌థెరిస్సా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో చిరు అభిమానులు రక్తదానం చేశారు. ఈ పాదయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చిరు అభిమానులు గాయపడ్డారు.
|