ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఢిల్లీలో యూఎన్‌పీఏ నేతల అరెస్టు
రైతుల సమస్యలపై న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో యూఎన్‌పీఏ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. యూఎన్‌పీఏ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే ధర్నాకు పోలీసుల అనుమతి లేకుండా ధర్నాకు పూనుకోవడంతో చంద్రబాబు, ములాయం సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

వీరిని అరెస్టు చేసి ఒక స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వీరి అరెస్టు వెనుక శాంతి భద్రతల కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అరెస్టులపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయలేక పోయారని వారు దుయ్యబట్టారు. ఇదిలావుండగా అరెస్టు చేసిన నేతలను తక్షణం విడుదల చేయాలని యూఎన్‌పీఏ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
మరిన్ని
జులైలో చంద్రయాన్ ప్రయోగం
రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: జయప్రకాష్
ముంబై వ్యక్తికి దేహశుద్ది  
భేషరతు క్షమాపణ చెప్పిన ఉండవల్లి
అదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉండవల్లి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు