ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పోలీసుల అదుపులో అనుమానితుడు
కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు హరిప్రభు కిడ్నాప్ కేసులో దివాకర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులోని ఒక లాడ్జిలో బసచేసివున్న ప్రభును మంగళవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెల్సిందే. ఈ కిడ్నాప్‌ వెనుక తన అత్తమామలు (దాసరి దంపతుల) హస్తం వుండవచ్చని ప్రభు భార్య సుశీల మీడియాకు వెల్లడించారు. ఈనెల 24వ తేదీన భార్య సుశీల, కుమారునితో కలసి ప్రభు చిత్తూరుకు చేరుకున్నారు.

శేషాపీరన్‌ వీధిలో ఉన్న పీవీఎన్‌ లాడ్జిలో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. సోమవారమంతా ముగ్గురు లాడ్జీలో గడిపారు. అయితే మంగళవారం సాయంత్రం 6.20 సమయంలో చిత్తూరుకు చెందిన మణి అనే వ్యక్తి వారి గదికి వచ్చి ప్రభును బయటకు పిలిచాడు. బయటకు వచ్చిన ప్రభును మరో నలుగురు వ్యక్తులు మెడ పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళారు.

ఈ విషయం గమనించిన సుశీల గది తలుపులు పెద్దగా బాదడంతో ఆ శబ్దానికి లాడ్జీ సిబ్బంది వచ్చి మణిని పట్టుకున్నారు. ఆ తర్వాత గది తలుపులు తెరచి సుశీలను తీసుకొని వెళ్లి స్థానిక ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి, మణిని పోలీసులకు అప్పగించారు. ఇదిలావుండగా ప్రభు కిడ్నాప్ కేసులో దివాకర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దివాకర్ ఆసూకీ మాత్రం ఇంకా తెలియలేదు.
మరిన్ని
మార్చి 9న తితిదే "కళ్యాణమస్తు"
విజయవతమైన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఢిల్లీలో యూఎన్‌పీఏ నేతల అరెస్టు
జులైలో చంద్రయాన్ ప్రయోగం
రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: జయప్రకాష్
ముంబై వ్యక్తికి దేహశుద్ది