ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంగన్‌వాడి కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్‌లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో అంగన్‌వాడి కార్యకర్తలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తమ వేతనాలు పెంచాలంటూ ధర్నా నిర్వహించిన అంగన్‌వాడి కార్యకర్తలు గురువారం అసెంబ్లీని చుట్టుముట్టారు. దీంతో భద్రతా కారణాలతో వారిని అరెస్టు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వేతనాలు పెంచడంపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వస్తామని మంత్రి రాజ్యలక్ష్మి ఇచ్చిన హామీని అంగన్‌వాడి కార్యకర్తలు అంగీకరించలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చర్చలు విఫలం కావటంతో అంగన్‌వాడి కార్యకర్తలు గురువారం ఇందిరా పార్కు వద్ద నుంచి బయలుదేరి అసెంబ్లీని ముట్టడిచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాయి.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున భద్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియానికి తరలించినట్లు సమాచారం.
మరిన్ని
రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తే సహించం
తెలంగాణాపై కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు: అద్వానీ
అదిగో కారు.. ఇదిగో మానవబాంబు...?
తగ్గుతున్న ఆధ్యాత్మికత: జయేంద్ర సరస్వతి  
జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ  
కాలేజీ విద్యార్థినుల ఫ్యాషన్ షో