ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఘనంగా ప్రారంభమైన మాహాశివరాత్రి ఉత్సవాలు
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. సృష్టి లయకారకుడైన పరమశివుడిని శ్రద్ధాభక్తులతో ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పూజిస్తే సకల దోషాలు, పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.

ముందుగా ధ్వజ స్తంభం వద్ద పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగే ఆరాధనలు చేయడం ద్వారా వచ్చే పెద్ద ధ్వనులతో సకల లోకాలు దద్దరిల్లిపోతాయని.. దీంతో ఆ రోజున వైకుంఠ ద్వారాలు కూడా మూసివేస్తారని ప్రతీతి.

శివరాత్రి మరుసటి రోజున భోళా శంకరుడైన పరమశివుణ్ణి పరిణయమాడుతుంది సాక్షాత్తు జ్ఞానాంబికాదేవి రూపంలోని పార్వతీదేవి. అత్యంత వైభవంగా జరిగే ఈ కళ్యాణమహోత్సవ సమయంలోనే అనేక మంది జంటలు వివాహాలు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. అలా వివాహం చేసుకోవడం ద్వారా కలకాలం పార్వతీపరమేశ్వరుల్లా కలిసి ఉంటారన్నది పెద్దల విశ్వాసం.
మరిన్ని
అంగన్‌వాడి కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తే సహించం
తెలంగాణాపై కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదు: అద్వానీ
అదిగో కారు.. ఇదిగో మానవబాంబు...?
తగ్గుతున్న ఆధ్యాత్మికత: జయేంద్ర సరస్వతి  
జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ