పుస్తక పఠనం ద్వారా మేధోసంపత్తి పెరగుతుందని రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీ అన్నారు. శుక్రవాహం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ కమ్యూనిజం, మార్క్సిజం, లెనిజం వంటి పుస్తకాలు చదవడం ద్వారా చరిత్ర తెలియడమే కాకుండా దీన్ని అనుసరించిన వ్యక్తుల విధానం, జీవన శైలి తదితర అంశాలు తెలుస్తాయన్నారు. ముఖ్యంగా కోలెన్ టిప్పింగ్ రచించిన రాడికల్ ఫార్గ్యూవ్‌నెస్, రాడికల్ మ్యానిఫ్యాస్టేషన్ పుస్తకాలు చదవడం వలన ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఆసియా మార్కెట్‌లో ఈ పుస్తకాలను ప్రచురించి, విక్రయించేందుకు అంతర్యామి పబ్లిషర్స్ వంటి సంస్ధలకు అనుమతి లభించడం హర్షణీయమన్నారు. చారిత్రాత్మక అంశాలు కలిగిన మంచి పుస్తకాలను ప్రతి ఒక్కరు చదివేలా అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన సూచించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమలో అంతర్యామి పబ్లిషర్స్ డైరక్టర్ జె.శైలజా, ఎమ్మెల్సీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ఎం.జి.గోపాల్, ఐటిఓఐ డైరక్టర్ తదితరులు పాల్గొన్నారు.
|