రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషామీరా హత్య కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరు విశాఖపట్నం, గాజువాకకు చెందిన వారిగా భావిస్తున్నారు. అయితే వీరికి అయేషా హత్య కేసుతో సంబంధం వున్నదీ లేనిదీ ఇంకా నిర్థారణ కాలేదు. అయినప్పటికీ వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో కాకపోయినప్పటికీ ఇతర కేసులతో సంబంధం వుందని పోలీసులు చెప్పారు.
ఇటీవల నందిగామలో కొంతమంది టీనేజర్లను అత్యాచారం జరిపి తామే హత్య చేసినట్లు నిందితులు విచారణ సందర్భంగా చెప్పినట్లు సమాచారం. అయితే.. వీరిద్దరికి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అంటున్నారు. అయినప్పటికీ అయేషా హత్య కేసులో వీరి ప్రమేయంపై మాత్రం పోలీసులు నోరు విప్పడం లేదు. అయేషా హత్య కేసులో సైకో కిల్లర్స్ హస్తం ఉండి వుండవచ్చని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే.
|