తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైతన్య యాత్ర నల్గొండ జిల్లాలో శనివారం జరుగుతుంది. పొరుగున ఉన్న గుంటూరు జిల్లా నుంచి బాబు యాత్ర శుక్రవారం రాత్రికి నాగార్జున సాగర్‌కు చేరుకుంది. పార్టీ కార్యకర్తలతో పాటుగా, నాయకులు ఆయనకు జిల్లా సరిహద్దులో ఘనస్వాగతం పలికారు.
నాగార్జున సాగర్‌లోని అతిథి గృహంలో బాబు బస చేశారు. నల్గొండ జిల్లాలో హాలియా, నిడమానూరు మీదుగా మిర్యాలగూడకు బాబు చైతన్య యాత్ర జరుగుతుంది. బాబు చైతన్య యాత్ర రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల మీదుగా సాగుతోంది. ప్రజి జిల్లాలో మూడుసార్లు బాబు పర్యటిస్తారు.
తెలంగాణా ప్రాంతంలోని 18 శాసనసభ సీట్లతో పాటుగా 4 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరుగుతున్నాయి. తెరాస నేతల రాజీనామాతో ఈ ఎన్నికలు ఉత్పన్నమయ్యాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ ఒకటో తేదీన జరుగుతుంది.
|