సాధారణ జనజీవన స్రవంతిలో మమేకమయ్యే విధంగా మావోయిస్టులు ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. నేపాల్‌లో మాదిరిగా మావోయిస్టులు ముందుకు రావాలన్నారు. మావోయిస్టులు ఆయుధాలను వీడి ప్రజలకు మరింత దగ్గర కావాలని కోరారు. తద్వారా వారికి ప్రజా మద్దతు పెరుగుతుందన్నారు.
తెలంగాణా ప్రాంతంలో జరిగే ఉపఎన్నికల్లో తమ పార్టీ మేడారం, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీచేస్తుందని వివరించారు. ఈ స్థానాల్లో ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్య, కరీం నగర్ జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు పోటీచేస్తున్నారన్నారు.
ఉపఎన్నికల్లో సీపీఎం-సీపీఐలు ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చిపుచ్చుకుంటారని తెలిపారు. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, తెదేపాలకు తాము సమ దూరంలో ఉంటామని నారాయణ స్పష్టం చేశారు.
|