పవిత్ర దివ్యక్షేత్రమైన తిరుమల కొండలపై ప్లాస్టిక్ వాడకాన్ని త్వరలో నిషేధిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. తద్వారా తిరుమల ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మారనుంది. డయల్ యువర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యక్రమాన్ని తితిదే ఈఓ కేవీ రమణాచారి శుక్రవారం ప్రారంభించారు.
తిరుమల కొండలపై కాలుష్యాన్ని నియంత్రించే పనులను తాము చేపట్టామని తెలిపారు. కనీస దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్ధులకు తోడ్పడేవిధంగా వారికి ఉచిత పుస్తకాలను తితిదే సరఫరా చేస్తుందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో దీనికి రూ.4 కోట్లు తితిదే వ్యయం చేసిందని చారి వివరించారు.
|