గుంటూరులోని మిరప మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 2లక్షల బస్తాల మిర్చి అగ్నికి ఆహుతైంది. ఆసియాలో అతిపెద్ద మిరప మార్కెట్‌గా గుంటూరును పిలుస్తారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు రూ.200 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. యార్డులో అగ్ని ప్రమాదం శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్ష్యుల కథనం. ప్రమాదానికి గల కారణాలు విభిన్నంగా ఉన్నాయి. ఈదురు గాలులు ధాటికి యార్డులోని కరెంటు తీగలు ఒకదానికి ఒకటి రాజుకుని బస్తాలపై పడి మంటలు లేచాయని ఒకరు అంటుండగా, నిర్లక్ష్యంగా తాగిపడేసిన సిగరెట్ కారణమని మరొకరు అంటున్నారు. ప్రమాదం కారణంగా గుంటూరు-నర్సరావుపేట మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
|