ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > ఏపీ న్యూస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మిర్చి యార్డు ప్రమాదంపై సత్వర చర్యలు : సీఎం
గుంటూరు మిర్చి యార్డు ప్రమాదంపై సత్వర చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడినుంచే ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాల గురించి వైఎస్ ఆరా తీశారు. అగ్నికీలలను అదుపు చేయటానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో కూడా వైఎస్ మాట్లాడారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ప్రమాద స్థలి వద్దనే ఉండి సహాయక చర్యలను వేగిరం చేయిస్తున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు గుంటూరులోది. మార్కెట్‌లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 200 లక్షల బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదం వల్ల రూ.200 కోట్ల మేర సంభవించిందని ప్రాథమిక అంచనా.
మరిన్ని
గుంటూరు మిరప మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం
త్వరలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా తిరుమల
మావోయిస్టులకు నారాయణ ఎన్నికల పిలుపు
నల్గొండ జిల్లాలో చంద్రబాబు నాయుడు యాత్ర
దేవతలారా... మము గెలిపించండి  
పెరిగిన రద్దీ... దొరకని శ్రీవారి లడ్డూలు