అమెరికా దేశాధ్యక్షుడు జార్జ్ బుష్ భారతదేశ మధ్యతరగతి ఆహార వినియోగంపై చేసిన వ్యాఖ్యలపై మన దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జార్జ్ బుష్ క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తుండగా మరికొందరు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఇక లెఫ్ట్ నేతలు ఆయన వైఖరిని దుయ్యబట్టగా బాజపా సీనియర్ నేత సి.హెచ్. విద్యాసాగరరావు బుష్ వ్యాఖ్యలను ఖండించారు.
మిస్సోరిలో జరిగిన సదస్సులో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రసంగిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ధరల పెరుగుదలకు భారత్ కారణమని ఆరోపించారు. భారతదేశ మధ్యతరగతి ప్రజలు ఆహార ధాన్యాల వాడకం భారీగా పెరిగిందన్నారు. భారతదేశంలో 350 మిలియన్ల మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయనీ, అమెరికా జనాభా కంటే వీరి సంఖ్య అధికమనీ వ్యాఖ్యానించటంతో భారత్‌లో సర్వత్రా నిరసనలు వెల్లువవుతున్నాయి.
|