బిడ్డ కలగగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. వారిని కంటికిరెప్పలా కాపాడుకుంటారు. అయితే ఇందుకు భిన్నమైన సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు పసికందులను వరంగల్ జిల్లాలోని ఎమ్‌జిఎమ్ ఆస్పత్రిలో చేర్చారు.
అయితే పరిస్థితి విషమించటంతో ఇరువురు మరణించారు. మరణించినవారిలో ఒక శిశువును వారి తల్లిదండ్రులు చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకున్నారు. మారుతున్న కాలంతోపాటు తరిగిపోతున్న మమకారానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన. కాలంకలిసిరాక తనువుచాలించిన ఈ నిర్భాగ్యులకు కనీసం అంత్యక్రియలు జరిపి వారి ఆత్మకు శాంతిచేకూరేలా చేయాల్సిన బాధ్యత రక్తం పంచి జన్మనిచ్చిన తల్లిదండ్రులదే కదా...
|